కరోనావైరస్ ను ఎదుర్కోవడం కోసం Rs 1500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్

ratan+tata+pics.jpg (594×387)
టాటా గ్రూప్ సంస్థలైన టాటా ట్రస్ట్స్ మరియు టాటా సన్స్ కరోనావైరస్ కు  వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కోసం 1,500 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా శనివారం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించారు. "COVID 19 సంక్షోభంతో పోరాడడానికి అత్యవసరంగా ఎమర్జెన్సీ వనరులను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇది మానవ జాతి ఎదుర్కొనే క్లిష్ట సవాళ్లలో ఒకటి."అని రతన్ టాటా పేర్కొన్నారు. 

వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు, పెరుగుతున్న కేసులకు చికిత్స చేయడానికి శ్వాసకోశ వ్యవస్థలు, దేశంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి కిట్‌లను మరియు ఇప్పటికే పాజిటివ్ గా తేలినవారికి చికిత్సా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. ఆరోగ్య కార్యకర్తలకు మరియు సాధారణ ప్రజలకు కరోనావైరస్ ను సమర్ధంగా ఎదురుకోవడంలో శిక్షణ ఇస్తామని కూడా టాటా గ్రూప్ తెలిపింది.

టాటా గ్రూప్ అవసరమైన వెంటిలేటర్లను తీసుకొని రావడం కోసం ప్రయత్నిస్తుంది , త్వరలో భారతదేశంలో కూడా వీటిని తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్  ఒక ప్రకటన విడుదల చేశారు. 

టాటా సన్స్ Rs 1000 కోట్లు, టాటా ట్రస్ట్స్ Rs 500 కోట్లు కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వనున్నాయి. ఇదే దారిలో మరిన్ని భారతదేశ కంపెనీలు కొరోనావైరస్తో పోరాటం కొరకు తగిన సహాయాన్ని
ప్రకటించాయి . 

Post a Comment

0 Comments