లొక్డౌన్ వలన పెరిగిన కూరగాయల ధరలు, ఉసూరుమంటున్న ప్రజలు

vege.jpg (635×446)
కరోనావైరస్ వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో లొక్డౌన్ ప్రకటించడం వలన కొన్నిచోట్ల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది వ్యాపారులు సరుకులు, కూరగాయల ధరలను పెంచి అమ్మడం కనిపించింది. ఈ పరిణామం పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణి త్వరగా జరిగితె పేదలు, వృద్దులకు ఈ కష్టాలు తప్పవచ్చు. 

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణాల్లో రోడ్ల పక్కన కూరగాయలు పెట్టి అమ్మడం కనిపించింది. కొన్ని చోట్ల టమాటో కిలో Rs 50 ఉండగా మరి కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఎప్పటిలాగా బేరం చేసే పరిస్థితులు లేకపోవడంతో వినియోగదారులు గలుగుతూనే కావాల్సిన కూరగాయలు, పండ్లు, సామాన్లు కొంటున్నారు. 

ప్రభుత్వ వ్యవస్థలు అన్నిచోట్ల తిరిగి ధరలు నియంత్రించడం కుదరక పోవచ్చు. ఇలాంటి సమయంలో వ్యాపురులే వాస్తవిక దృక్పధంతో రేట్లు పెంచి అమ్మకుండ ఉండాలని మనోజ్ అనే యువకుడు ఉప్పల్ లో మా ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపాడు. ఎప్పుడు నష్టాల్లో ఉండే రైతులు ఎక్కువ సంపాదిస్తే పర్లేదు కానీ మధ్యలో దళారులు వినియోగదారుల నుండి ఎక్కువ వసూలు చెయ్యడం నచ్చట్లేదు అంటూ వింధ్య అనే అమ్మాయి వైజాగ్ లో తెలుగుహిట్ ప్రతినిధికి తెలిపింది. 

ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులే కొనసాగితే, ప్రభుత్వం ధరల నియంత్రణకు పెద్దఎత్తున రంగంలోకి దిగే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments