ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులు ఉదయం 11 గంటల వరకు మాత్రమే : ఆళ్ల నాని

shops-in-andhrapradesh-till-11am-only-due-to-lockdown.PNG (307×320)

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా లొక్డౌన్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 నుండి 11 వరకు మాత్రమే నిత్యావసర కొనుగోళ్లు, అమ్మకాలకు అనుమతిస్తామని డిప్యూటీ సిఎం ఆళ్ల నాని రోజు ప్రెస్ మీట్ లో తెలిపారు. నిబంధనలు నగరాల్లో, పట్టణాల్లో వర్తిస్తాయని ఆయన తెలిపారు.

గ్రామాల్లో మధ్యాహ్నం 1 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నట్టు డిప్యూటీ సిఎం ఆళ్ల నాని మీడియా సమావేశంలో చెప్పారు. పట్టణాలు, నగరాల్లోని ప్రజలెవరూ ఉదయం 11 తరువాత రోడ్ల మీదకు రావొద్దని అయన కోరారు.

ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూస్తామని, అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. లొక్డౌన్ ఉండడంతో వేరే రాష్ట్రాలనుండి ఎవరైనా వస్తే క్వారంటైన్ లో పెడతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వారికి సహాయం అందించాలని ఏపి సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆళ్ల నాని తెలిపారు.

Post a Comment

0 Comments